ఈ తెలుగు ఎడిషన్ యంత్ర సహాయంతో అనువదించబడింది; సమీక్ష కొనసాగుతోంది. అధ్యయనానికి ఆంగ్ల మూల గ్రంథమే ప్రామాణికం. తప్పులు కనిపిస్తే [email protected]కు రాయండి.
31లో 29వ అధ్యాయం · వ్యాసాలు · తెలుగులో వ్యాసాలు
క్రైస్తవ జీవితము — ప్రార్థన
అసలు స్మారక సంచిక పేజీలు 175–176
పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ప్రార్థన యొక్క అవశ్యకతను మనకు ఎంతో వివరంగా వివరించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించారు. విసుగక, ఎడతెగక, నిత్యము ప్రార్థించండి. మెలకువగా ఉండి ప్రార్థించండి. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించండి. ఒకరికొరకు ఒకరు ప్రార్థించండి. అలా చెప్పవలసి వస్తే నూతన నిబంధనలో ప్రార్థనకు సంబంధించిన ఎన్నో అంశాలున్నాయి. ఏ వ్యక్తి ప్రార్థనలో అంటుగట్టబడ్డాడో ఆ వ్యక్తి బహుగా ఫలిస్తాడు. యోహాను 15.8లో
“మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు”.
ఏ కుటుంబములో కుటుంబ ప్రార్థన క్రమము తప్పకుండా ఆచరిస్తారో లేక జరుపుకొంటారో ఆ కుటుంబము దేవునికి బహుయిష్టమైన కుటుంబము. ఏ సంఘము ప్రార్థించే సంఘముగా ఉంటాదో ఆ సంఘము దేవుని కొరకు బలమైన సంఘముగా వాడబడును. ప్రార్థన యొక్క ఉద్దేశము మనకు కావలసినది పొందడము కాదు కానీ, దేవుడు కోరిన విధముగా మనము మారడమే. ప్రార్థనకు సమయమని స్థలమని నిర్దేశింపబడలేదు. క్రీస్తుద్వారా ఆయన సన్నిధికి ఏ సమయములోనైనా ప్రవేశించగలము. అది ఎంత అధిక్యతక్ష దేవునితో మన మనస్సు విప్పి మాట్లాడుకోవటమే ప్రార్థన. ప్రార్థన శ్వాసగా ఉండాలి. అంటే ఊపిరిగా ఉండాలి. దావీడు 30వ కీర్తనలో 8,9 వచనాలను మనము చూచినపుడు
“నేను గోతిలోనికి దిగినయెడలమన్ను నిన్న స్తుతించునా! నీ సత్యమును గూర్చి అది వివరించునా”
అని వ్రాయుట మనము చూస్తాము. అవును ఈ శ్వాస ఆగిపోయిన తరువాత మనము ఆయనను స్తుతించగలమా! దేవుడిచ్చిన యీ ఆయుష్షు కాలములో మనము ప్రార్థనను శ్వాసగా చేసుకోవాలి. దీనిని బట్టి మొదటిగా ప్రార్థనను మన ఊపిరిగా చేసుకోవాలి. అంటే ప్రార్థన మన శ్వాస. శ్వాసలేకపోతే మనము జీవించనట్లు ప్రార్థన లేకుండా క్రైస్తవుడు ఉండరాదు.
రెండవదిగా చూసినప్పుడు ప్రార్థన ఒక ఆయుధము. ఇది ఒక ఆయుధం. ప్రతిదినము మనము న్యూస్ పేపర్లలో ఎన్నో ఘాతుకాలు చూస్తున్నాము. దొంగలు, దోపిడీదారులు ఎన్నో అకృత్యాలను చూస్తున్నారు. అటువంటివారు మన మీద పడినప్పుడు మనచేతిలో ఒక ఆయుధము ఉండును, సులభముగా వారిని ఎదుర్కోవలసి ఉంటుంది ఉదాహరణకు మన చేతిలో ఇనుప రాడ్ ఉంటే వారిని ప్రతిఘటించగలము. అందుకు ప్రభువు మత్తయి 26:41లో
“మీరు శోధనలో ప్రవేశించినట్లు ప్రార్థన చేయుడి”
అని చెప్పాడు. ఎఫెసీ 6:10-18 వరకు చెప్పబడిన సర్వాంగ కవచాన్ని ధరించినపుడు అపవాదియనే శత్రువును మనము ఎదుర్కొనగలము. శరీరరీతిగ బలహీనుడై విశ్వాసి మోకాళ్ళపై ప్రార్థించగనే శత్రువు దానంతట అదే మటుమాయమవుతాడు. శోధనలనే కెరటాలతాకిడిని అడ్డుకోవాలంటే ప్రార్థన అంటే ఆయుధము క్రైస్తవ జీవితంలో ఉండవలసిందే.
ప్రార్థన ఒక ఆజ్ఞ. ఇది మూడవది. ఇది ఒక ఆజ్ఞ మన అధికారులు మనకు ఆజ్ఞలను యిస్తే పాటిస్తాము కదా! డ్రైవింగ్ నేర్చుకొన్న ప్రతి ఒక్కరికి రూల్స్ కొన్ని ఏర్పాటు చేస్తారు. దానిని అతిక్రమిస్తే ప్రమాదము తప్పదు. ఫిలిప్పీ 4:6
“దేనిని గూర్చియు చింతపడకుడి, కాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనమలచేత కృతజ్ఞతాపూర్వకముగ మీ విన్నపములు దేవునికి తెలియజేయండి”.
మత్తయి 5:44 “నేను మీతో చెప్పినదేమనగా
“మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి.
ప్రభువు తానే ఆ పనిచేసి మనకు మాదిరి అయ్యాడు. తనను హింసించి మరణానికి అప్పగించిన వారికొరకు ప్రార్థించాడు.
“తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరేరుగరు. వారిని క్షమించమని ప్రార్థించాడు”.
లూకా 23:34 దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేయాలి. పరిసయ్యుడు దేవుని ఆజ్ఞలను పాటించలేదు. లూకా 18:11 పరిసయ్యుడు నిలువబడి గుండెలు బాదుకొని ఎంతో బిగ్గరగా తన్ను తాను హెచ్చించుకొని ప్రార్థన చేసాడు. సుంకరి చిన్న ప్రార్థన ప్రభువు ఎందుకు అంగీకరించాడంటే ఆయన ఆజ్ఞలను సుంకరి మీరలేదు. దావీదు అనేక పర్యాయములు తన కీర్తనలతో
“నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను. కనుకనే దేవుడు నా ప్రార్థనను అలకించెనంటాడు”.
ఇతరులలోపాలను ఎంచి వారిని నొప్పించే విధముగా మన ప్రార్థన ఉండకూడదు. కనుకనే మన దేవుడు
“నీ హృదయములో పాపాన్ని లక్ష్యము చేస్తే నీ మనవి వినను”
ఇప్పుడు.
నాల్గవదిగా ప్రార్థన ఒక అభ్యాసము. అనేది ఒక అభ్యాసం. ఆచరించాలి, చేసి చూపించాలి. మన ప్రభువే మనకు పూర్తిగా మార్గదర్శకుడు. ప్రజలను చూచి కనికరపడి జాలిపడి, వారి దుస్థితిని చలించి కదిలిపోయెను. అట్టివారిని అక్కున చేర్చుకొని ప్రార్థించేవాడు. పేదవారి దుస్థితి కొరకు ప్రార్థించి ఇతరులఅక్కరలకొరకు ప్రార్థించి వారికి మనము చేయు విదల్చకపోతే మన ప్రార్థనను ఆచరించి పెట్టనట్లే. కొన్ని సార్లు ప్రార్థన మొదలు పెట్టగానే ఇతరులఅక్కర్లు కనుమరుగై మన స్వార్థమే జయిస్తుంది. ఒక భక్తుడు యిలా అన్నాడు. మన పెదవులతో కంటే మన జీవితాలతో మెరుగైన ఉపన్యాసం బోధించగలము, కొరింథీ 3:9
“మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా”
నేను
బిడ్డలకు ప్రార్థన ఉగ్గుపాలతో అభ్యసింపజేయాలి. సామెతలు 22:6లో "బాలుడు నడవలసిన మార్గము వానికి నేర్పుము. వాడు పెద్ద వాడైనపుడు దానినుండి తొలగిపోడు". మత్తయి 23:3 లో శిష్యులతో శాస్త్రులు పరిసయ్యులను గురించి ప్రభువు ఈ విధముగా చెప్పుట మనము చూస్తాము. "అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురేగాని చేయరు".
ఐదవదిగా ప్రార్థనను ఒక అలవాటుగా చేసుకోవాలి. ఇది ఒక అలవాటు. మేము ఒకసారి మా బంధువులింట్లో జరిగే వివాహానికి చెన్నై వెళ్ళాము. వెళ్ళిన బంధువులకు విడిది యిచ్చారు. పెండ్లి ఇల్లు చాలాదూరంలో ఉంది. కాఫీ, ఫలహారాలు మాకు అందడానికి చాలా సమయం పడుతుంది. మాలో కొందరికి ఉదయాన్నే టీ, కాఫీలు అలవాటు. కాఫీ, టీలు పడకపోతే యీ మానవ శరీరము ముందరికి నడవవు. లేవగానే యీ అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. క్రైస్తవులముగా మనకుండవలసిన ముఖ్య అలవాటు ఏమై ఉండాలి. ప్రభువు సన్నిధిలో మోకరించి సమయము గడిపే అలవాటు. ప్రభువు తన సేవాకార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలుపెట్టాడు. (లూకా 3: 21, 22) లూకా 6:12లో మనము చూచినట్టైతే శిష్యులను ఏర్పరచుకొనకముందు ప్రార్థనలో గడిపాడు. మార్కు 1:35లో "ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి యుండగనే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. స్తుతించుచువచ్చెను.
చివరిగా ప్రార్థనలో గడపాలి అనే ఆశ కల్గియుండాలి. క్రైస్తవులముఖ్య డిజైర్‌గా ప్రార్థన మొదటిస్థానంలో ఉండాలి. వాక్యము చదవడమంటే దేవుడు మనతో మాట్లాడడము. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడాలి. ప్రార్థనపోరుడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచి గొప్ప దైవజనుడైన బిల్లీగ్రాహమ్‌గారు తన 90+ సం॥లన్నిటిలో అమెరికా సంయుక్త రాష్ట్రములో ప్రెసిడెంట్లు అయిన ప్రతి ఒక్కరినీ కలవగల్గారు ఈ విషమయి విలేఖరులు ఆయనను ఇంటర్వ్యూలో అడిగినపుడు అదెంత గొప్ప విషయమన్నట్లు చెప్పి ఒకే మాటన్నారు. బైబిలులో గొప్ప భక్తులైన యెషయా, యెహెజ్కేలు, యోహానులు దేవుని దర్శనాన్ని చూచినవారు "అది ఏమీ కాదు ఈరోజు నేను దేవునితో మాట్లాడాను". దావీదు 63:5 కీర్తనలో "రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునపుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది. అంటాడు. ప్రార్థన అనే ఆశ కల్గిన లూథియ అనే స్త్రీని మనము అ.కా 16:13లో చూస్తాము. కానీ ఆశ కల్గిన మన ప్రార్థనలో తప్పక మన కర్తవ్యం. దేవుడు తప్పక మన ప్రార్థనలో పాల్గొంటాడు. వారికొరకు ప్రార్థించాలి.
ప్రతిచోటా సేవకులు అవసరమైన ఒక పవిత్రమైన ఉన్నత పిలుపు ఉంది. అది సేవ యొక్క అత్యున్నత రూపం. అది ప్రార్థన పరిచర్య.
అవును ప్రార్థించుట సేవలన్నింటిలో ఉత్కృష్టమైనది. శ్రేష్టమైనది.
ముద్రిత స్మారక సంచికలో ఈ వ్యాసం పాత (నాన్-యూనికోడ్) తెలుగు ఫాంట్‌లో ఉండేది. స్క్రీన్ రీడర్‌ల ద్వారా శోధించడానికి, పరిమాణాన్ని మార్చడానికి మరియు చదవడానికి వీలుగా, ఈ వెబ్ ఎడిషన్ కోసం దీనిని యూనికోడ్ తెలుగులోకి తిరిగి టైప్ చేయడం జరిగింది. అసలైన ముద్రిత పేజీలు కింద పునరుత్పత్తి చేయబడ్డాయి.
View the original printed pages

