ఈ తెలుగు ఎడిషన్ యంత్ర సహాయంతో అనువదించబడింది; సమీక్ష కొనసాగుతోంది. అధ్యయనానికి ఆంగ్ల మూల గ్రంథమే ప్రామాణికం. తప్పులు కనిపిస్తే [email protected]కు రాయండి.
31లో 27వ అధ్యాయం · వ్యాసాలు · తెలుగులో వ్యాసాలు
పరిషత్తు
అసలు జ్ఞాపిక పేజీ 172
"నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై వుండు" అని దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించాడు. ఆది 17.1.
ఇశ్రాయేలు జాతి దేవునికి పరిశుద్ధ జనం. వారి ఆహారం, విహారం అన్ని పవిత్రమై ఉండాలి. యాజకుడి మీద "యెహోవా పరిశుద్ధుడు" అని చెక్కబడి వుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులుగా జీవించాలి.
భక్తి అంటే యెహోవా పరిశుద్ధ పర్వతానికి ఎక్కడం! కీర్తనలు 97.10 యెహోవాను ప్రేమించే వారలారా! చెడుతనాన్ని అసహ్యించుకోండి. క్రైస్తవం రాజమార్గం. అది పరిశుద్ధ మార్గం. అపవిత్రులు పోగూడని మార్గం. ఇదే సిలువ మార్గం. పరిశుద్ధతకే క్రైస్తవ నీతి అని మరో పేరు. హృదయశుద్ధి గలవారే దేవుడిని చూడగలరు. మత్తయి 5.48లో ప్రభువు చెప్పినట్లు మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనమూ పరిపూర్ణులమై వుండాలి. కపటం లేని ప్రవర్తనే పరిశుద్ధత.
### సంస్కృతి, సభ్యత.
పరిశుద్ధత విశ్వాసుల ఆధ్యాత్మిక సంస్కృతి, సభ్యత. పాపము గురించి మృతులకు మృతుడవై దేవుని విషయంలో బ్రతక పరిశుద్ధత. నిత్య జీవం నాణ్యతగల పరిశుద్ధ జీవితం. ఇది ఆత్మానుసారమైన జీవితం. ఈ లోక మర్యాదను అనుసరించక మనసు మారి నూతనమై రూపాంతరం చెందాలి. విశ్వాసి పరిశుద్ధాత్మకు ఆలయం! ఈ పాడుచేసిన వాణ్ణి దేవుడు పాడు పాడు. విశ్వాసి పవిత్రురాలైన కన్యకగా యేసయ్యకు సమర్పించబడి ప్రధానం చేయబడి వున్నారు. విశ్వాసిలో పరిశుద్ధాత్మ పండించే ఫలం ప్రేమ. యిందులో నుంచి పరిశుద్ధ ఫలాలు పుట్టుకొస్తాయి. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వీకం, ఆశానిగ్రహం, యివన్నీ పరిశుద్ధతకు చిహ్నాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి పరిశుద్ధ జీవితానికి రుజువు, అని మనం తెలుసుకోవాలి!
### తొలగిపోవాలి
ప్రభువు నామాన్ని ఒప్పుకునే ప్రతివాడు దుర్నీతినుండి తొలగిపోవాలి. లోక స్నేహం దేవునితో విరోధం. ప్రత్యేకించ బడి, దేవునికి ప్రతిష్ఠించబడిందే పరిశుద్ధం! అపో॥ కార్య 2.27 లో యేసు ప్రభువు "దేవుని పరిశుద్ధుడు" అని పిలువబడ్డాడు. ఈ పరిశుద్ధతను విశ్వాసం ద్వారా పొందిన వారే పరిశుద్ధులు. పరిశుద్ధ జీవితం కలిగినవారు! దేవుని గుణగణాలన్నీ కిరణాలలాగా వచ్చి నీతి సూర్యుడైన క్రీస్తునందు కేంద్రీకరించినప్పుడు అదే పరిశుద్ధత! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు. అయితే ఈ ముగ్గురిలో దేవుని పరిశుద్ధతను ప్రత్యేకంగా విశ్వాసులకు అన్వయం చేసేవారు పరిశుద్ధాత్మ!
దేవుడు తన ప్రజలలో పరిశుద్ధతను చూడగోరుతున్నాడు. యేసయ్య పరిశుద్ధతే విశ్వాసి సౌశీల్యానికి హామీ కూడా ! హెబ్రి 2.11 దేవుడు పరిశుద్ధుడు. అది ఆయన ముఖ్య లక్షణం! పవిత్రత అంటే పాపాన్ని విడిచి దేవునికి మనలను మనం ప్రతిష్ఠించుకోవటం! దేవుని మహా పవిత్రతను మనం గ్రహించలేము. శిష్యుడైన యోహాను ప్రభువుకు ఎంతో సన్నిహితంగా వున్నవాడు. అయినా ప్రభువును తన మహిమలో చూచినప్పుడు చచ్చిన వానిలాగా పడిపోయాడు. 1 పేతురు 1.16లో "నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి" అని చెప్పబడింది. అలాంటి స్థితిలో వుండటం ఎంత ధన్యత! దేవుని వాక్యం వెలుగులో సంచరిస్తూ, ఆత్మతో నింపబడినట్లయితే, మనం పాపరహిత జీవితం జీవించగలం.
###
అనేకసార్లు మనం ఆధ్యాత్మిక జీవితంలో సంఘర్షణలకు లోనవుతూ వుతాము. ఆత్మ, శరీరాలకు ఎడతెగని పోరాటం ప్రవర్తిస్తూ వుంటుంది. ఈ పోరాటంలో ఎటూతేల్చుకోలేక చిక్కు పడుతూ వుంటాము. "మనం పాపం విషయంలో చనిపోయిన వాళ్ళుగా ఎంచుకోవాలి.(రోమా 6.11) కానీ, మన విషయంలో పాపము యింకా చావలేదు. చాలాసార్లు ప్రార్థనలో కనిపెట్టడం మానివేసి లోకాల్లోకి మరలు కొల్పబడతాం! ప్రభువుకు నమ్మకంగా వుండలేక పాత స్వభావాన్ని పాటిస్తాం.
మనం దేవునికి ఎంత సన్నిహితంగా జీవిస్తామో, అంతగా దైనందిన జీవితంలోని విషయాలలో విజయం సాధిస్తాం. మనం జయ జీవితం జీవించటానికి కావలసినవన్ని దేవుడు సమకూర్చాడు. అనుక్షణము ఆయన కృప అందుబాటులో వుంది. అయినా మనం తప్పిపోతున్నామంటే దానిక్కారణం దేవుడు అనుగ్రహించిన వనరులు వివియోగించుకోక పోవడమే.
### జీవిత చరిత్ర
మనలను మనం నిజాయితీగా ఇలా ప్రశ్నించు కుందాం. "పాపానికి శిక్ష ఏమిలేదని గట్టిగా తెలిస్తే, అలాంటప్పుడు మనం చేసే పాపాలకు మితి వుంటుందా?" కేవలం మాటలలోనే పవిత్రతను గురించి చర్చిస్తున్నామా? పవిత్రత అంటే దేవుని పోలి వుండటమే. అలా కాదని ఎవరైనా బోధిస్తే అది చెడుగు, సైతాను సంబంధించిన మాట. మరి, మన జీవితాలు మాటేమిటి? మన ప్రార్థనలకు జవాబు రాకుండా ఏదైనా పాపం అడ్డు వస్తుందా? దేవుని ముఖాన్ని మరుగు చేసే పాపం ఏదైనా మన జీవితంలో పొడసూపిందా? దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకొని ఆయన రక్తంలో కడుగుకొని పవిత్రులం కావాలి! ఏదో కొన్ని పనులు చెయ్యనంత మాత్రాన పవిత్రులం కాము. ఉదాహరణకు మద్యపానాలు సేవించడం, పొగ త్రాగడం, వ్యభిచారం చేయలేము. కానీ దేవుని స్తుతించక పోతే ఆయనకు సాక్షిగా జీవించక పోతే, నశించుచున్న వారి కోసం భారంతో విజ్ఞాపన చేయకపోతే ..... అలాంటి వ్యక్తి పరిశుద్ధుడందామా? దేవుడు అపవిత్రమైన పాత్రలను తన సత్యంతో నింపేవాడు కాదు. పవిత్రమైన పాత్రలనే ఆయన తన మహిమకోసం వాడు కుంటాడు. కనుక నశించుచున్నవారికి దేవుని సత్యసువార్తను ప్రకటించడానికి పవిత్రమైప పాత్రలుగా వుండాలని మనందరి ఆశ, ప్రార్థన కావాలి !
ముద్రిత స్మారక సంచికలో ఈ వ్యాసం పాత (నాన్-యూనికోడ్) తెలుగు ఫాంట్‌లో ఉండేది. స్క్రీన్ రీడర్‌ల ద్వారా శోధించడానికి, పరిమాణాన్ని మార్చడానికి మరియు చదవడానికి వీలుగా, ఈ వెబ్ ఎడిషన్ కోసం దీనిని యూనికోడ్ తెలుగులోకి తిరిగి టైప్ చేయడం జరిగింది. అసలైన ముద్రిత పేజీలు కింద పునరుత్పత్తి చేయబడ్డాయి.
View the original printed pages
